Book Excerpts

My Photo
Name:
Location: Hyderabad, Telangana, India

Marxist , Ambedkarite , philosopher agnost spirituality no religion

Saturday, December 07, 2024

Postmodernism, universality , regionality

 పౌర సమాజం , రాజకీయ సమాజం , పబ్లిక్ జీవితం , ప్రైవేట్ జీవితం - అనేవి ప్రపంచమంతటా, విశ్వజనీనం గా, ఒకే రకం గా ఉండవు . 

హెగెలియన్ , మార్కిస్టు ఫిలాసఫీ లో - విశ్వజనీనత అనేది ఒక ప్రధాన విలువ. 

హెగెల్ దృష్టిలో, విశ్వజనీనత అనేది ఒక సాధనం గా, ప్రాంతీయత వాస్తవీకరించ బడుతుంది. నిర్దిష్టత ను పొందుతుంది. 

మార్క్సు దృష్టి లో విశ్వజనీనత అనేది - సామాజిక నిర్మితి లోని వైరుధ్యాలు సమగ్ర రూపం పొందే క్షేత్రం . 


ఆధునికానంతర వాదుల దృష్టి కోణం ఇందుకు పూర్తి వ్యతిరేకం గా ఉంది. వారు, విశ్వజనీనత & ప్రాంతీయత అనేవి రెండు విభిన్న విషయాలు గా, విరుద్ధ అంశాలు గా, రెండితి మధ్య సయోధ్య అసాధ్యం గా , చుస్తారు . 

విశ్వ జనీనత నీ, ప్రాంతీయ వాస్తవికత నీ ఒకటి గా కలిపి చూడడం అంటే - ఈ రెండింటి లోనూ ఒక దానిని తక్కువ చేసి చూడడం గా భావిస్తారు. 

ఎందుకంటే, ( పోస్టు మోడర్నిష్టు ల అభిప్రాయం ప్రకారం ) ఆధునికత అనేది, మొదటి నుంచి విశ్వ జనీనత కి పట్టం కడుతూ, ప్రాంతీయతలని ధ్వంసం చేస్తూ వచ్చింది . 


" విశ్వ మానవుడు, విశ్వ నాగరికత " పేరు తో , ఆధునికత, ప్రాంతీయ సంస్కృతులని, నాగరికతలను, జీవన విధానలనూ, ధ్వంసం చేస్తూ వచ్చింది . 

ఆధునికీకరణ క్రమం లో , ఈ విశ్వజనీనత అనేది అసాధారణ రూపం లో కొనసాగింది ! 

Labels: