Balagopal on anti liquor / prohibition movement by Leftist parties
సారా వ్యతిరేక ఉద్యమం లో వామపక్ష పార్టీ ల పాత్ర, అవి చేసిన తప్పులు, వాటి అవగాహనా పరిమితుల పైన , బాల గోపాల్ గారు !
" ప్రభుత్వాలు, సారాయి కాంట్రాక్టర్ లను ప్రోత్సహించడం , వారి లాభాలు పెరిగి, అదొక పెద్ద్ద రౌడీ వ్యాపారం గా మారడం, ఆ వ్యాపారం లో పెరిగిన హింస , వారే రాజకీయాల్లో ప్రముఖ స్థానాలకి యెగ బ్రాకడం, పేద కార్మికులు మరింత మద్యానికి బానిస అవ్వడం, ఈ దోపిడి క్రమాన్ని మొదట గురించినది వామ పక్ష పార్టీలే !
వారు మొదట , సారా ధర తగ్గింపు కోసం ఆందోళన చేసి ప్రజలచే తిట్లు తిన్నారు !
అసలు బాధితులు, కార్మికుల భార్యా బిడ్డలు, అనగా, స్త్రీలు, పిల్లలు అన్న విషయం వారి గమనం లోకి రాలేదు !
తన సంపాదన అంతా, త్రాగి, ఇల్లు వొళ్ళు గుల్ల చేసుకుంటున్న కూలీ/ కార్మికుడే వారికి ప్రధాన బాధితుడి గా కనిపించాడు !
" మా భర్తల చేత మరింత తాగించడమా మీ ఉద్ద్యేశ్యం ? " అని కూలీలు, కార్మికుల భార్యలు నిలదీసే వరకు తాము చేస్తున్న తప్పేమిటో వామ పక్ష పార్టీ లకు అర్ధం కాలేదు .
పీడక వర్గాలయిన ప్రభుత్వాలు, సారాయి కాంట్రాక్టర్ లతో పాటు, సంపాదించిందంతా త్రాగి తమ జీవితాలను, మరియు కుటుంబాలను నాశనం చేస్తున్న శ్రామిక పురుషులు కూడా ఈ పోరాటం లో వైరి పక్షమే నని - స్త్రీలు ప్రకటించే వరకు ఎమ్మెల్ పార్టీ లకు అర్ధం కాలేదు !
దీనికి కారణం ? వామ పక్ష పాటీ లలో ముఖ్య నాయకులంతా మగ వాళ్ళే అనేదే కాక, ' కార్మిక వర్గం ' లో అధిక శాతం పురుషులే కావడం వలన, స్త్రీల కోణం లో నుంచి వారు ఆలోచించలేక పోయారు.

