223 . Michael Foucault on how State Apparatus uses individuals
Michael Foucault ( మైకేల్ ఫ్యూకో ) on the State , its vice like grip on Individuals and how it uses individuals for its own perpetuation and strengthening .
\" ఆధునిక యుగం లో, రాజ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యం తో నడిచే ప్రభుత్వాలకి , ప్రజల గురించి కానీ, వారి సంక్షేమం గురించి కానీ ఆందోళన చెందాల్సిన అవసరం కాని, చింత కానీ అంతగా ఉండదు. అందువల్ల, రాజ్యం, సమాజం లోని వ్యక్తులని అంతగా పట్టించుకోదు.
వ్యక్తులు, సమూహాలు, రాజ్యం యొక్క శక్తి ని ఎంతవరకు పెంచుతాయని పాలకులు భావిస్తారో, అంతవరకు మాత్రమే, ప్రభుత్వం, వ్యక్తుల, సమూహాల శక్తులని పెంచుతుంది .
వ్యక్తుల అస్తిత్వం నుంచి, వారి ప్రవర్తన, ఆలోచన, చివరికి వారి మరణం తో సహా, రాజ్యానికి ఎంతవరకు ఉపయోగపడతాయి ? అనే నిరంతర ఆలోచనలోనే ప్రభుత్వాలు ఉంటాయి.
అలా, వ్యక్తి రాజకీయ ఉపయోగం గురించి మాత్రమే ఆలోచించే రాజ్యం, వ్యక్తి ని అంచుల్లోకి ( margins ) నెట్టేస్తుంది .
ఈ ' అంచుల్లోకి నెట్టి వేసే క్రమం ఎంత తీవ్రం గా ఉంటుందో వివరిస్తూ, ఫ్యూకో ( Michael Foucault ) ఇలా అంటారు .
" కొన్ని సందర్భాలలో, రాజ్యం కోసం వ్యక్తి జీవించడం, శ్రమించడం, ఉత్పత్తి చేయడం, వినిమయం చేయడం, అవసరమైతే చావడం కూడా చెయ్యాల్సి ఉంటుంది !
ప్రాచీన కాలం లో ( Modernism / ఆధునికతా వాదం కి ముందర ) - రాజ్య ప్రయోజనం గురించి వ్యక్తిని వాడడం అనేది, నైతిక నిర్బంధం వల్ల, మతం, దేవుడు వంటి నమ్మకాల వల్ల, మనుషులను నియంత్రించడం , వాడుకోవడం సాధ్యం అయేవి ( emotional blackmail and cultural brainwash ) .
దీనికి భిన్నం గా, 17 వ శతాబ్దం లో ముందుకి వచ్చిన ఆధునిక రాజ్య హేతువు ( State and its reason for being ; or ' Raison de' tre ) , ' పోలీసు ' అనే కొత్త వ్యవస్త ద్వారా , రాజ్యాన్ని బలొపేతం చేయడానికి వ్యక్తి ని వాడుకోవడం ప్రారంబించింది .
రాజ్యం అనేది, తన పరిపాలనా యంత్రాంగాన్ని, నిర్మాణాలని, న్యాయ వ్యవస్థ నీ, ప్రజలతో సమైక్య పరచ డానికి, అనుసంధానం చేయడానికి, పోలీసు వ్యవస్థ ని వాడుకుంటుంది .
Labels: Postmodernism


0 Comments:
Post a Comment
<< Home