Postmodernism and its love of diversity and inclusion
Why Postmodernism is against the ' Single Overarching idea ' or grand narrative or meta narrative ! How its core philosophy of specificity and diversity goes against the grain of Modernism , its universality and unified ideas.
మనం ఒక సిద్ధాంతానికి అంకితం అయిపోతే , మనం ప్రపంచాన్ని , సంఘటనల్ని ఆ సిద్ధాంతపు చట్రం లో నుంచే చూస్తాము. మన పరిశీలనలు అన్నీ ఆ సిద్ధాంతపు భాష లో కూరుకు పోయి ఉంటాయి . ఈ చట్రపు పరిమితులు మన జ్ఞానాన్ని కూడా ఆవరించి ఉంటాయి .
ప్రపంచం గురించి నూటికి నూరు శాతం జ్ఞానం కానీ, ' అఖండ జ్ఞానం ' కానీ , అసాధ్యం '! ప్రపంచం , ఒకే భాష ని కానీ, ఒకే భావన ని కానీ కలిగి లేదు.
ప్రపంచం , బహుళత్వం తో, విభిన్నత తో నిండి ఉంది . అందువల్ల విశ్వ జనీన సూత్రాలకి తావు లేదు !
ఈ వాస్తవాన్ని విస్మరించి, విశ్వ జనీన సూత్రాల కోసం, ప్రమాణాల కోసం అన్వేషించడం, పునాది వాదం లో ఒక భాగం .
అన్నింటినీ ( ఫినామినా ) వివరించ గలిగే , నిర్వచించ గలిగే ఏక సూత్రం కోసం వెతుకులాట - అసంబద్ధం .
జీవితానికి, ప్రపంచానికి అర్ధం , తయారు చేయ బడుతుంది , సృష్టించ బడుతుంది తప్ప , కనుక్కో బడదు !


0 Comments:
Post a Comment
<< Home