postmodernism page 153
పౌర సమాజం , రాజకీయ సమాజం, పబ్లిక్ జీవితం, private జీవితం - అనేవి విశ్వజనీనం గా ఒకే రకం గా ఉండవు ! ఒక్కో దేశం లో, ఒక్కో సమాజం లో , ఒక్కో రకం గా ఉంటాయి.
" modernism philosophy " లో, Hegelian & Marxist philosophy లో, విశ్వజనీనత ఒక common , ప్రధాన విలువ.
Hegel దృష్టి లో, విశ్వజనీనత ఆధారం గా ప్రాంతీయత వాస్తవీకరించ బడుతుంది. నిర్దిష్టత ను పొందుతుంది .
మార్క్స్ దృష్టి లో, సామాజిక నిర్మితి లోని వైరుధ్యాలు సమగ్ర రూపం పొందే క్షేత్రం - విశ్వజనీనత .
ఈ ఫిలాసఫీ కి విరుద్ధం గా గా - ఆధునికానంతర వాదులు , విశ్వజనీనత , ప్రాంతీయత విరుద్ధ అంశాలుగా, రెండింటి మధ్య సయోధ్య అసాధ్యం గా, చూస్తారు.
ఆధునికత ( Modernism ) మొదటి నుంచీ ( అనగా , 1789 ఫ్రెంచి విప్లవం, సాం స్కృతిక పునరుజ్జీవనం, Age of enlightenment , 1850 లలో వచ్చిన పారిశ్రామిక విప్లవం, Communist Manifesto రచనా కాలం నుంచి ) , విశ్వ జనీనత కి పట్టం కడుతూ, ప్రాంతీయతలని ధ్వంసం చేస్తూ వచ్చింది .
' విశ్వ మానవులు, విశ్వ నాగరికత ' పేర్లతో ప్రాంతీయ సంస్కృతులు, ప్రాంతీయ నాగరికతలు ధ్వంసం చేయబడ్డాయి.
ఈ ' విశ్వ జనీనత కీ, విశ్వ సంస్కృతి కీ లొంగని ప్రాంతీయ జాతులు రక్తసిక్తం అయి, అనేక దాడులకు గురి అయ్యా యి !
కొన్ని ప్రాంతాల సంస్కృతులు మాత్రమే ఉన్నతమైనవి గా , పురోగామి లక్షణాలు కలవి గా ( ఉదాహరణకి, స్వేతజాతీయుల European సంస్కృతి, సామాజిక & రాజకీయ విలువలు ), ఇతర సంస్కృతులు వెనకబడినవి గా, నీచమైనవి గా చూడబడ్డాయి.
ముఖ్యం గా యూరోపియన్ సంస్కృతి , ప్రపంచం లో ప్రతి పరిణామాన్నీ, తనని ( యూరోప్ ని ) కేంద్రం గా చేసుకుని నిర్వచిస్తూ వచ్చింది ,
పోస్ట్ మోడర్నిజం / ఆధునికానంతరత - దీనిలోని ( Eurocentric Worldview ) ఔచిత్యాన్ని ప్రశ్నిస్తుంది .


0 Comments:
Post a Comment
<< Home