Book Excerpts

My Photo
Name:
Location: Hyderabad, Telangana, India

Marxist , Ambedkarite , philosopher agnost spirituality no religion

Thursday, October 24, 2024

Instrumental Rationality and Technocracy in Postmodernism

 సమాజం లో  Instrumental Rationality  ( తెలుగు లో దీనిని సాధక హేతుబద్ధత అనవచ్చు నేమో ? ) పెరిగిన కొద్దీ సాంకేతిక స్వామ్యం బలపడుతుంది  ( Technocracy ) 

ఈ దశలో,  science  నీ , technology  ని , దాని ఫలితాలనూ కీర్తించే వారు , చాలా ప్రధాన వ్యక్తులు గా గుర్తించ బడతారు. కీర్తించ బడతారు !

( Examples : From Sam Pitroda during 1985 to 1990 . To Infy Narayana Murty and Nandan Nilakeni in recent times. To Elon Musk trying to influence the US elections at in 2024. Many technocrats becoming bureaucrats in many governments around the world . ) 

' నిపుణులు ' గా పిలవబడే వీళ్ళు , క్రమం గా సమాజం లో అన్ని వ్యవస్థ లనీ కంట్రోలు చేసే అధికార కేంద్రాలు గా తయారు అవుతారు. 

వీరు చెప్పిందే వేదం గా అందరూ భావిస్తారు . సైన్సు , టెక్నాలజీ పై అవగాహన లేని వారంతా, రాజకీయ నాయకులతో సహా, అప్రధాన వ్యక్తులు గా పరిగణింప బడతారు . 

చాలా మంది ఆధునికానంతర వాదులు  ధోరణి ని గమనించారు . సామాజిక నియంత్రణ కి  Science and Technology  కొత్త సాధనాలు గా పరిణమించాయని ప్రకటించారు. 

వాస్తవానికి సాంకేతిక స్వామ్యం లో , సైన్సు అంతా సశాస్త్రీయం గా ఉంటుందనీ , సైన్సు వల్ల అన్నీ సత్ఫలితాలు మాత్రమే వస్తాయనీ దుష్ఫలితాలు రావనీ , గ్యారంటీ ఏమీ లేదు ! 

Wednesday, October 23, 2024

Oppression has many forms - say postmodernists .

Postmodernism and its views on mental and cultural oppression through symbolisms .  

అణిచివేత కి సంబంధించిన ఆధునికానంతర భావాలు ( postmodern views on social and cultural oppression )  , సాంప్రదాయ భావాలకి చాలా భిన్నం గా ఉంటాయి . 

సాంప్రదాయ రాజకీయాలు , చాలా బహిరంగం గా కనిపించే అణిచివేత గురించి మాత్రమే మాట్లాడతాయి . 

ఆధునికానంతర వాదం , ఇందుకు భిన్నం గా, సమాజం లో మార్మికం  ( invisible ) గా, ప్రతీకాత్మకం ( metaphorical and symbolic )  గా కనిపించే అణచివేతల్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది . 

సమాజం లో అమలు అవుతూన్న ప్రతీకాత్మక హింస  ( symbolic mental violence )  పైన ఆధునికానంతర వాదులు ఎక్కువ దృష్టి సారిస్తారు . ఈ దాడి పైకి కనబడదు కానీ, ఈ  మానసిక హింస మరింత దారుణం గా ఉంటుంది . 

NATURE OF SYMBOLIC AND CULTURAL VIOLENCE , ACCORDING TO POSTMODERN OBSERVERS 

ఈ ప్రతీకాత్మక హింస, అణచివేయ బడుతున్న వర్గాలకి, ఆ స్పృహ లేకుండా చేస్తుంది . తాము అనుభవిస్తున్న శిక్ష , తమకు అనివార్యం అనే భావం వారిలో కలుగ జేస్తుంది  ( we deserve it ! ) 

( Through propaganda machinery and advertising ) 

ఉదాహరణ కి  Frantz Fanon - వలసవాదం క్రింద నలిగిపోతున్న వారు , తమని తాము ఎలా ద్వేషించుకుంటారో చెప్పారు, ' Wretched of the Earth ' అనే పుస్తకం లో. 

( FRANTZ FANON  was an Afro Carribean writer from Martinique Islands , a French Colony in West Indies ) 

 Swedish economist Gunnar Myrdal   గ్రంధం, '  The American Dilemma  - The Negro Problem and Modern Democracy ( 1944 )  ' నల్ల జాతి వారి లో పెంచబడిన శారీరక న్యూనతా భావం వారిని ఎలా బానిసలు గా మార్చిందో చూపిస్తుంది . దానిని వారు ఎలా అంగీకరించారో చూపించింది . 

అలాగే, క్రమం గా వారు తమ పునాదుల్ని, జాతి సంబంధితమైన వారసత్వాలను ఎలా మరిచి పోవడానికి ప్రయతించారో మనకి తెలియజేస్తుంది . 

చాలా దేశాల్లో స్త్రీలు , ' శరీర నిర్మాణమే తమ స్త్రీత్వానికి గమ్యం ' అని బ్రెయిన్ వాష్ చేయబడి , ద్వితీయ శ్రేణి పౌరులు గా చూడబడి , ఎలా అణచివేతకి గురి అవుతున్నారో మనం ప్రస్తుతం కూడా చూస్తూ నే ఉన్నాం. 

పై పద్ధతుల్లో, కొన్ని ప్రజా సమూహలను , కొన్ని బృందాలను ఆత్మ న్యూనత కు గురి చేయడం ద్వారా, వారిపై ఆధిపత్యం చెలాయించడం ఎలా సులువైందో, పాలస్తీనియన్ - అమెరికన్ ప్రొఫెసర్  EDWARD SAID  లాంటి వారు ఋజువు చేశారు .

Examples : Anorexic women . Beauty Pegeants . Obsession with Size Zero shapes and fair skin . Beauty parlors business. 

Postmodernists views these as cultural violence through collective brainwash . Or obsession with height .  Let us remember that none of these physical parameters are applicable to men . We can even look at the Matrimonial Columns under ' Bride wanted ' heading and look at the desired parameters, esp fair skin and height. 

Hence, feminists embraced postmodernism in 1960 s. 


Tuesday, October 22, 2024

Postmodernism's contribution to DEIB

POSTMODERNISM and its opposition to Modernism and its contribution to Diversity, Equity, Inclusion and Belonging ( DEIB )  

ఇప్పటి దాకా మనం చూసిన ' పునాది వ్యతిరేక ఆధునికానంతర భావనలు ' విభిన్నత రాజ్యం చేయడానికి అవసరమైన తలాన్ని కల్పిస్తాయి. 

తద్వారా, ఆధునికాంతరత - స్వేచ్చ ని, విభిన్నత నీ, బహుళత్వాన్నీ, తనలో ఇముడ్చుకో గలుగుతుంది . 

ఈ చైతన్యం లో నుంచే , ఆధునికానంతర వాదం, అస్తిత్వం లో ఉన్న సాంఘిక, సాంస్కృతిక విలువలని, వాటి ఆధిక్యత నీ ప్రశ్నించ గలిగింది . 

ఉదాహరణకి, పాశ్చాత్య ప్రపంచం లో శ్వేత జాతీయుల ఆధిపత్యాన్ని నిరాకరించి , పరాయి గా చూడ బడ్డ, పరాయి స్థానాల లోకి నెట్ట బడ్డ నల్ల జాతీయులను, శ్వేత జాతీయులకు ప్రతి గా నిలపగలిగింది. 

అలాగే, స్త్రీ పురుష సంబంధాలలో , ద్వితీయ స్థానం లోకి నెట్టబడ్డ స్త్రీ జాతిని సమాన స్తానం లోకి నిలపగలిగింది - స్త్రీ వాద ఉద్యమమాల ద్వారా. 

విభిన్న సామాజిక ఉద్యమాలను, సంస్కృతులను , ఆచార వ్యవహారాలను, భావ శైలులను , అంగీకరించింది . గౌరవించింది . 

' యూరప్ కేంద్రక దృష్టికోణం ' నుంచి మానవ జాతిని విముక్తి చేసే ప్రయత్నం లో, మిగతా ప్రపంచపు ప్రాముఖ్యత ను నొక్కి చెప్పింది. 

విభిన్న సామాజిక సమూహాలు , తమ గురించి తాము ఎలుగెత్తి మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది . 

' పరాయి ' పట్ల సహనాన్ని, విభిన్నత పట్ల గౌరవాన్ని ప్రదర్శించేటట్లు చేయ గలిగింది . 

ముఖ్యం గా, సమాజం లోని ప్రతి బృందం, తమని గురించి తాము స్వంత కంఠాలతో మాట్లాడుకునే హక్కు కలిగి ఉంటుందనే విష్యాన్ని ముందుకు తెచ్చింది . 

పై ఆలోచనా సరళి ఫలితం గా, స్త్రీ ఉద్యమాలు, నల్లజాతి ఉద్యమాలు, మైనారిటీ ఉద్యమాలు, సకల అణగారిన వర్గాల అస్థిత్వ ఉద్యమాలు, ఆదిమ తెగల ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు అనేవి రంగం మీదకి వచ్చి గుర్తింపు పొందాయి. 

ఈ ఉద్యమాల పట్ల ఇంద్ర ధనస్సు లాంటి ఐక్యత  ఉంటుంది . దీనినే ' ఇంద్ర ధనస్సు సంకీర్ణత ' అన్నారు ! 

పై క్రమం అంతా కూడా, ఆధునికానంతర వాదులు ముందుకు తెచ్చిన ' పునాది వ్యతిరేక జ్ఞాన  సిద్ధాంతాల ' ద్వారా సాధ్యం అయింది . 

Page No 118 . Post Modernism , telugu book by Mr B Tirupati Rao. 

Postmodernism and its love of diversity and inclusion

 Why Postmodernism is against the ' Single Overarching idea ' or grand narrative or meta narrative ! How its core philosophy of specificity and diversity goes against the grain of Modernism , its universality and unified ideas. 

మనం ఒక సిద్ధాంతానికి అంకితం అయిపోతే , మనం ప్రపంచాన్ని , సంఘటనల్ని ఆ సిద్ధాంతపు చట్రం లో నుంచే చూస్తాము. మన పరిశీలనలు అన్నీ ఆ సిద్ధాంతపు భాష లో కూరుకు పోయి ఉంటాయి . ఈ చట్రపు పరిమితులు మన జ్ఞానాన్ని కూడా ఆవరించి ఉంటాయి . 

ప్రపంచం గురించి నూటికి నూరు శాతం జ్ఞానం  కానీ, ' అఖండ జ్ఞానం  '  కానీ , అసాధ్యం '! ప్రపంచం , ఒకే భాష ని కానీ, ఒకే భావన ని కానీ కలిగి లేదు. 

ప్రపంచం , బహుళత్వం తో, విభిన్నత తో నిండి ఉంది . అందువల్ల విశ్వ జనీన సూత్రాలకి తావు లేదు  ! 

ఈ వాస్తవాన్ని విస్మరించి, విశ్వ జనీన సూత్రాల కోసం, ప్రమాణాల కోసం అన్వేషించడం, పునాది వాదం లో ఒక భాగం . 

అన్నింటినీ ( ఫినామినా ) వివరించ గలిగే , నిర్వచించ గలిగే ఏక సూత్రం కోసం వెతుకులాట - అసంబద్ధం . 

జీవితానికి, ప్రపంచానికి అర్ధం , తయారు చేయ బడుతుంది , సృష్టించ బడుతుంది తప్ప , కనుక్కో బడదు ! 

Monday, October 21, 2024

philosophy of postmodernists - page 109

 మనలను సరళం గా, స్వంత అనుభూతుల నుంచి, మన అనుభవాలను అంతరంగీకరించుకుని, ' నీకు నీవు గా ఉండు (  ' Be yourself  ) అంటుంది, ఆధునికానంతర వాదం. 

 post modernist  - తన నిర్దిష్ట సామాజిక వాస్తవికత కి పరిమితమై ఉంటాడే తప్ప, 

" విశ్వ జనీజ వాస్తవికత ' ( Universal Reality )  పై సత్య ప్రకటనలు చేయడు / చేయదు. 

ఆధునికానంతర వాదులు , ప్రస్తుత సమస్యల గురించి, ప్రస్తుత ఆనందాల గురించే ఆలోచిస్తూ ఉంటారు. శాస్వత స్థానం లో, వీరు తక్షణ అంశాలనీ, విషయాలనీ మాత్రమే పరిగణిస్తారు. 

వీరితంతా '  Live and let live ' ధోరణి . ఆధునికానంతర వాదులకు , వారి వ్యక్తిగత జీవితం , వారికి ముఖ్యం . 

పాత విధేయతలు, శ్రేణీకరణలు, పెళ్ళి , కుటుంబం, మత సంస్థ లు, మొదలైనవి వీరిని అంతగా ప్రభావితం చెయ్యవు . 

సామూహిక కార్యాచరణ కీ, బాధ్యతలకీ, వీళ్ళు దూరం. 

ఇవి వ్యక్తిత్వ వికాసానికి అడ్డంకులని వీళ్ళు నమ్ముతారు. ఎందుకటే, సామూహిక కార్యాచరణలు వ్యక్తిగత త్యాగాన్ని కోరతాయి. 

వీరి జీవిత విధానం లో ఎటువంటి విశ్వ జనీన మైన ప్రకటనలు ఉండవు. వ్యక్తిగత స్వేచ్చ , విముక్తి , వీరి ఆదర్శాలు. 

ఒక సామాజిక విలువ కంటే, మరొక సామాజిక విలువ గొప్పదని భావించ డానికి వీరు వ్యతిరేకం. అణిచివేత నిండిన ఆలోచనా చట్రలూ, వ్యవస్థ లూ , వీళ్ళకి గిట్టవు. 

Saturday, October 19, 2024

Post Modernism by B Tirupati Rao - page 100 - excerpt

 ఆధునికానంతర వాదులు ( Post Modernists )  , సత్యాన్ని శకలాలుగా ( fragments ) , నిరంతరం మార్పునకు గురి అవుతూ , విచ్చిన్నమయేది గా చూస్తూంటారు. 

ఆధునిక వాదుల  ( Modernists ) దృష్టి లో - సత్యం ఎప్పుడూ సత్యం ఎప్పుడూ ఒక రచయిత నీ, ఒక కర్త నీ ప్రతిపాదిస్తుంది . సత్యాన్ని వారికి ఆపాదిస్తుంది. 

ఆధునికానంతర వాదుల దృష్టి కోణం ఇందుకు భిన్నం ! వారు సత్యాన్ని ఏ ఒక్క వ్యక్తి కీ, కర్త కీ ఆపాదించరు ! 

ఒక వ్యక్తి చెప్పేది ఆమెకి / అతనికి సంబంధించినదే కానీ, ప్రపంచం మొత్తానిది కాదు ! 

ఆధునికానంతర వాదం (  Postmodernism ) సారాంశం లో మనం గ్రహించాల్సింది ఏమిటంటే - సత్యానికి సంబంధించిన వివిధ కధనాలు (  versions  ) ఉంటాయి కానీ, ఏకైక సత్యాలూ, అఖండ సత్యాలూ, విశ్వ జనీన సత్యాలు అనేవి ఉండవు . 

ఆధునికానంతర వాదం ( Postmodernim ) , ప్రాతినిద్య వాదాన్ని( concept of representation )  వ్యతిరేకిస్తుంది. అంటే - సత్యానికి ఎవరో ఒక వ్యక్తి, లేదా సమూహం లేదా బృందం ప్రాతినిధ్యం వహించ గలరు అనే భావాన్ని, ప్రతిపాదన నీ, నిరాకరిస్తుంది . 

అంతిమం గా ఆధునికానంతర వాదులు - ' విశ్వజనీనమైన సత్యాల ' స్థానం లో, వ్యక్తిగతమైన, ప్రాంతీయమైన , సాపేక్షితమైన సత్యాలని మాత్రమే అంగీకరిస్తారు . " 

Source : Post Modernism by B Tirupati Rao - page no 100