Book Excerpts

My Photo
Name:
Location: Hyderabad, Telangana, India

Marxist , Ambedkarite , philosopher agnost spirituality no religion

Monday, November 11, 2024

223 . Michael Foucault on how State Apparatus uses individuals

Michael Foucault ( మైకేల్ ఫ్యూకో ) on the State , its vice like grip on Individuals and how it uses individuals for its own perpetuation and strengthening . 

 \" ఆధునిక యుగం లో, రాజ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యం తో నడిచే ప్రభుత్వాలకి , ప్రజల గురించి కానీ, వారి సంక్షేమం గురించి కానీ ఆందోళన చెందాల్సిన అవసరం కాని, చింత కానీ అంతగా ఉండదు. అందువల్ల, రాజ్యం, సమాజం లోని వ్యక్తులని అంతగా పట్టించుకోదు. 

వ్యక్తులు, సమూహాలు, రాజ్యం యొక్క శక్తి ని ఎంతవరకు పెంచుతాయని పాలకులు భావిస్తారో, అంతవరకు మాత్రమే, ప్రభుత్వం, వ్యక్తుల, సమూహాల శక్తులని పెంచుతుంది . 

వ్యక్తుల అస్తిత్వం నుంచి, వారి ప్రవర్తన, ఆలోచన, చివరికి వారి మరణం తో సహా, రాజ్యానికి ఎంతవరకు ఉపయోగపడతాయి ? అనే నిరంతర ఆలోచనలోనే ప్రభుత్వాలు ఉంటాయి. 

అలా, వ్యక్తి రాజకీయ ఉపయోగం గురించి మాత్రమే ఆలోచించే రాజ్యం, వ్యక్తి ని అంచుల్లోకి ( margins  ) నెట్టేస్తుంది . 

ఈ ' అంచుల్లోకి నెట్టి వేసే క్రమం ఎంత తీవ్రం గా ఉంటుందో వివరిస్తూ, ఫ్యూకో ( Michael Foucault )  ఇలా అంటారు . 

" కొన్ని సందర్భాలలో, రాజ్యం కోసం వ్యక్తి జీవించడం, శ్రమించడం, ఉత్పత్తి చేయడం, వినిమయం చేయడం, అవసరమైతే చావడం కూడా చెయ్యాల్సి ఉంటుంది ! 

ప్రాచీన కాలం లో (  Modernism  / ఆధునికతా వాదం కి ముందర ) - రాజ్య ప్రయోజనం గురించి వ్యక్తిని వాడడం అనేది, నైతిక నిర్బంధం వల్ల, మతం, దేవుడు వంటి నమ్మకాల వల్ల, మనుషులను నియంత్రించడం , వాడుకోవడం సాధ్యం అయేవి  ( emotional blackmail and cultural brainwash ) . 

దీనికి భిన్నం గా, 17 వ శతాబ్దం లో ముందుకి వచ్చిన ఆధునిక రాజ్య హేతువు ( State and its reason for being ; or ' Raison de' tre )  , ' పోలీసు ' అనే కొత్త వ్యవస్త ద్వారా , రాజ్యాన్ని బలొపేతం చేయడానికి వ్యక్తి ని వాడుకోవడం ప్రారంబించింది  . 

రాజ్యం అనేది, తన పరిపాలనా యంత్రాంగాన్ని, నిర్మాణాలని,  న్యాయ వ్యవస్థ నీ,  ప్రజలతో సమైక్య పరచ డానికి, అనుసంధానం చేయడానికి, పోలీసు వ్యవస్థ ని వాడుకుంటుంది . 

Labels:

Wednesday, November 06, 2024

Postmodern angst against the atrocities of Modernism

 మార్క్సు , ఫ్రాయిడ్, డార్విన్ చెప్పినవి, ఈ క్రమమంతా సత్యానికి చెందిన ఆధునిక అవగాహన గా అమలు అయింది. దీని ఫలితం గా, శుద్ధ హేతువు ముందు,అనుభవం నిరాకరణ కి గురి అయింది . మానవ అనుభవం లో ఉండే బహుళత్వాలూ, వైరుధ్యాలూ, సందిగ్దతలూ, సంఘర్ధణలూ, నిరాదరణ కి గురి అయ్యాయి ( ఆధునిక యుగం లో , 1790 - 1950 కి మధ్యకాలం లో ). నిరాకరింప బడ్డాయి . వస్తుగత తత్వాన్ని కూడి ఉంటుందని మనం నమ్మిన హేతువు, సంకుచితమయింది .
వస్తుగతత్వమే అన్నింటికీ సుచీ, కొలబద్ద అయింది  !
మతం, నమ్మకం - ఎంత అసహనాన్ని కలిగి ఉండేవో, కాల క్రమం లో హేతువు కూడా అంతే అసహనం పెంపొందించుకుంది.
హేతువు యొక్క శుద్ధ వెలుగులో చూసినప్పుడు, ఒకే వాస్తవికత, ఒకే దృక్కోణం, ఒకే సత్యం ఉంటాయి.

" సత్యం ఒక్కటే ! " అనే ఈ ప్రగాఢ నమ్మకం చరిత్ర లోని ఇతర ప్రత్యామ్నాయ అభిప్రాయాల పట్ల అసహనానికీ, రక్తపాతాలకీ, " పవిత్ర యుద్ధాలకీ " , మత యుద్ధాలకీ, శిరఛ్చేదనలకూ, ఇంకా అనేక రకాల భీభత్సాలకీ కారణం అయింది .
ఈ " ఒకే నమ్మకం, ఒకే విశ్వాసం " అనేది ఎంతో అసహనం తో, అద్భుత విషయాలని ముందుకు తెచ్చిన వ్యక్తులని బలి పీఠాల పైకి నెట్టింది . అమలు లో ఉన్న వాస్తవికత ను ప్రశ్నించిన వారిని బలికొంది. గొప్ప చారిత్రాత్మక ఆదర్శాల బలిపీఠం పైన , వ్యక్తులని ఊచకోత కోసింది. " ( ఆధునిక వాదం /  modernism )
పేజి 98

postmodernism page 153

 పౌర సమాజం , రాజకీయ సమాజం,  పబ్లిక్ జీవితం, private  జీవితం - అనేవి విశ్వజనీనం గా ఒకే రకం గా ఉండవు ! ఒక్కో దేశం లో, ఒక్కో సమాజం లో  , ఒక్కో రకం గా ఉంటాయి.
" modernism philosophy  " లో,  Hegelian & Marxist philosophy  లో, విశ్వజనీనత ఒక common , ప్రధాన విలువ.

 Hegel దృష్టి లో, విశ్వజనీనత ఆధారం గా ప్రాంతీయత వాస్తవీకరించ బడుతుంది. నిర్దిష్టత ను పొందుతుంది .
మార్క్స్ దృష్టి లో, సామాజిక నిర్మితి లోని వైరుధ్యాలు సమగ్ర రూపం పొందే క్షేత్రం - విశ్వజనీనత .
ఈ ఫిలాసఫీ కి విరుద్ధం గా  గా - ఆధునికానంతర వాదులు , విశ్వజనీనత , ప్రాంతీయత విరుద్ధ అంశాలుగా, రెండింటి మధ్య సయోధ్య అసాధ్యం గా, చూస్తారు.
ఆధునికత ( Modernism  ) మొదటి నుంచీ ( అనగా , 1789 ఫ్రెంచి విప్లవం, సాం స్కృతిక పునరుజ్జీవనం,  Age of enlightenment , 1850 లలో వచ్చిన పారిశ్రామిక విప్లవం,  Communist Manifesto  రచనా కాలం నుంచి ) , విశ్వ జనీనత కి పట్టం కడుతూ, ప్రాంతీయతలని ధ్వంసం చేస్తూ వచ్చింది  .
' విశ్వ మానవులు, విశ్వ నాగరికత ' పేర్లతో ప్రాంతీయ సంస్కృతులు, ప్రాంతీయ నాగరికతలు ధ్వంసం చేయబడ్డాయి.
ఈ ' విశ్వ జనీనత కీ, విశ్వ సంస్కృతి కీ లొంగని ప్రాంతీయ  జాతులు రక్తసిక్తం అయి, అనేక దాడులకు గురి అయ్యా
యి !

కొన్ని ప్రాంతాల సంస్కృతులు మాత్రమే ఉన్నతమైనవి గా , పురోగామి లక్షణాలు కలవి గా ( ఉదాహరణకి, స్వేతజాతీయుల  European  సంస్కృతి, సామాజిక  & రాజకీయ విలువలు ), ఇతర సంస్కృతులు వెనకబడినవి గా, నీచమైనవి గా చూడబడ్డాయి.
ముఖ్యం గా యూరోపియన్ సంస్కృతి , ప్రపంచం లో ప్రతి పరిణామాన్నీ, తనని ( యూరోప్ ని ) కేంద్రం గా చేసుకుని నిర్వచిస్తూ వచ్చింది  ,

పోస్ట్ మోడర్నిజం / ఆధునికానంతరత - దీనిలోని 
( Eurocentric Worldview ) ఔచిత్యాన్ని ప్రశ్నిస్తుంది .