Book Excerpts

My Photo
Name:
Location: Hyderabad, Telangana, India

Marxist , Ambedkarite , philosopher agnost spirituality no religion

Monday, August 19, 2024

State hegemony on citizens - by K Balagopal. ( మనిషి - మార్క్సిజం పేజి 46

 State hegemony on citizens - by K Balagopal. 

" తన ఉనికి కే ప్రమాదం ! అని తాను - వాస్తవికం గానో, అవాస్తవికం గానో - నమ్మిన అసమ్మతి వాదుల విషయం లో రాజ్యం చాలా నిర్దాక్షిణ్యం గా ఉంటుంది . 

తన సమాజం లో మామూలుగా ఆదరించే సాధారణ విలువలను సైతం తృణీకరించి , వారిని శిక్షిస్తుంది. 

న్యాయ విచారణ లో నిష్పాక్షికం గా సాఖ్యాన్ని మదింపు వేయవలసిన న్యాయమూర్తి సైతం , ఆ నిష్పాక్షికత ను పాటించడు ! ( నేరం ఇంకా ఋజువు కాని ) ముద్దాయిల పైన అప్రస్తుత ద్వేషాన్ని రెచ్చగొట్టడం తప్పని తెలిసీ, ప్రాకిక్యూటర్ ఆ పనే చేస్తాడు ! 

ముద్దాయిల పైన కట్టగల కేసేదీ ( కోగ్నైజబుల్ అఫెన్సు) లేదని నమ్మే పోలీస్ అధికారిని దర్యాప్తు ప్రక్రియ నుంచి తప్పించి , ముద్దాయి ల పై రాకజీయ కసి ఉన్న అధికారి చేత నేర పరిశోధన చేయిస్తారు . 

కోర్టు లో సత్యం చెప్పక తప్పదని తెలిసీ , అలా చెప్పినవారి ఉద్యోగాలు పీకేయిస్తారు . 

మనుషుల సంఘ జీవితాన్ని కంట్రోలు చేయడానికి ఉత్పన్నమైన వ్యవస్థ లలో ' రాజ్యం' ఒకటి . అయితే, అది కేవలం ఆధిపత్య, పీడక వర్గాలు మాత్రమే సృష్టించినది కాదు ! సంఘ జీవితానికి అది ఎప్పుడైనా అవసరమే ! 

అయితే, మానవ సమాజం లో అసమానతలు, ( కొన్ని వర్గాల ) ఆధిపత్యం ఉన్నంతకాలం, ఈ ' నియంత్రణ ' అనేది నిష్పాక్షికం గా, సమానం గా జరగదు. రాజ్యం అనేది, కొందరి పక్షాన ఉండి, మరి కొందరిని నియంత్రించే స్వభావాన్ని సంతరించుకుంటుంది . 

అసమానతలు, ఆధిపత్యం పోవాలని మనం కోరుకున్నట్లే, సమాజం స్వయం నియంత్రితం కావాలని మనం కోరుకుంటాము . 

Tuesday, August 13, 2024

manishi marxism - page 131 , identity based agitations vs ML parties attitude towards ' The State '.

K Balagopal points out the principle difference between Marxist - Leninist parties and agitations based on identity based politics - and their principle difference in their attitude towards ' The State ' . 

Identity based agitations do not throw the baby with the bathwater, avers Balagopal.  

రాజ్యం పట్ల , రాజ్యం యొక్క సార్వభౌమాధికారం పట్ల, ఈ నూతన ( అస్థిత్వ ) ఉద్యమాలు ఒక కొత్త వైఖరి ని తీసుకు వచ్చాయి . 

సాంప్రదాయ వామ పక్ష పార్టీలు, ముఖ్యం గా Marxist Leninist Party లు , రాజయం పట్ల వారి ధోరణి, ఆలోచనా విధానం, సుమారు గా ఇలా ఉంటుంది . 

 (1) రాజ్యాన్ని మొత్తం గా, గంపగుత్త గా, ప్రజలకు శత్రువు గా భావించడం,

 (2) రాజ్యం యొక్క సాధికారత ను మొత్తం గా తిరస్కరించడం, 

 (3) రాజ్యం లోని ప్రజాస్వామ్య వ్యవస్థ లు, విలువలు అనేవి - బూతకపు సాధికారత ను కల్పించే భావజాల సాధనాలు తప్ప, వాటి ద్వారా, తమ జీవితాలను బాగు చేసుకునే అవకాశం కానీ, అసమానతలు తొలగించుకునే అవకాశం కానీ, పీడిత ప్రజలకు లేదని నమ్మడం, 

(4)  అటువంటి ' illusions  ప్రజలలో ఉంటే, దానిని తొలగించాలని నమ్మడం, ఇవి , రాజ్యం పట్ల Marxist-Leninist Party ల దృక్పధం లో ప్రధానాంశాలు. 

కానీ, కొత్తగా పుడుతున్న నూతన అస్తిత్వ ఉద్యమాలు దీనిని ఆమోదించడం లేదు ! తాము  ఎదుర్కొంటున్న సాంఘిక అణచివేత కు రాజ్యం మద్దత్తు ఇస్తున్నప్పుడు, వత్తాసు గా నిలిచినప్పుడు  మాత్రమే, అవి రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి ! నిలదీస్తున్నాయి. 

అయితే, అదే రాజ్యం కల్పించే ప్రజాస్వామిక అవకాశాలను , నిజమైన అవకాశాలు గా స్వీకరించి , సాంఘిక ( అగ్ర వర్ణ, పురుష ) అణిచివేత ను ఎదుర్కొనడానికి ఆ అవకాశాలను వాడుకుంటున్నాయి ( నూతన, స్త్రీ వాద, దళిత, ఇతర అస్తిత్వ ఉద్యమాలు ). 

అవి , మొత్తం గా, రాజ్యం యొక్క సాధికారత ను తిరస్కరించడం లేదు ! 

విమర్శనాత్మకం గా వ్యవహరిస్తూ, ఆ సాధికారత ను తమ అవకాశాలకు అనుగుణం గా మలుచుకుంటున్నాయి . 

బాల గోపాల్. " మనిషి - మార్క్సిజం ' పేజి 131.